విశాఖలో సైబర్ నేరగాళ్లు అరెస్ట్
విశాఖపట్నంలో ఐదుగురు సైబర్ నేరగాళ్లను సీబీఐ అరెస్టుచేసింది. ఢిల్లీలో నమోదైన ఓ కేసులో భాగంగా సీబీఐ వీరిని అరెస్టు చేసింది. విశాఖలోని ఎండాడలో ఉంటున్న ఈ ఐదుగురు ఒక కాల్ సెంటర్లో పనిచేస్తున్నారు. వీరంతా ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతూ పలువురి నుంచి డబ్బు కాజేస్తున్నారని తెలిపారు. స్థానిక కోర్టులో హాజరు పరిచిన తరువాత, సీబీఐ తన కస్టడీలోకి తీసుకుంది.