జాగ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్స్ ను పట్టుకొన్న పోలీసులు
విశాఖపట్నం :
ఈ రోజు విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ అధికార్లకు వచ్చిన సమాచారం మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలో గల క్రాంతి థియేటర్ ఎదురుగా వున్న పాన్ షాప్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా, 133 గంజాయి చాక్లెట్లు (660గ్రాములు) స్వాదీనం చేసుకోవడమైనది. నిందితుడు మనోజ్ కుమార్ చౌదరి ని అరెస్టు చేసి అతనిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సోదాల్లో పాల్గొని 133 గంజాయి చాక్లెట్లు (660గ్రాములు) స్వాదీనం చేసుకొన్న టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ భరత్ మరియు టూ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ మరియు సిబ్బందిని నగర పోలీసు కమీషనర్ శంఖబ్రత బాగ్చి ఐపిఎస్ అభినందించారు.