బలాత్కారం చేస్తుంటో 'నో' చెప్పలేరా? ఫెఫ్కా ప్రతినిధి ప్రశ్న?
September 06, 2024
0
జస్టిస్ హేమ కమిటీ నివేదిక ప్రకంపనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కమీషన్ చాలా మంది హీరోలు, నటులను చిక్కుల్లోకి నెట్టింది. కానీ లోతుగా చూస్తే ఇందులో ఇంకా చాలా సమస్యలు బయటకు రాలేదని అర్థమవుతోంది.తాజాగా హేమా కమీషన్ సినీ పరిశ్రమలో పెద్ద సంఖ్యలో మహిళలను పట్టించుకోలేదని `ఫెఫ్కా` మహిళా ప్రతినిధి విమర్శించారు. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఫెఫ్కా) మహిళా విభాగానికి నేతృత్వం వహిస్తున్న కళాకారిణి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఎంపిక చేసిన కొంతమంది మహిళల ప్రకటనలను మాత్రమే కమీషన్ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. హేమా కమిషన్ నివేదికపై విశ్వాసం లేదని కూడా ఆమె అపనమ్మకం వ్యక్తం చేసింది. ఇది లైంగిక వేధింపుల ఫిర్యాదులపై మాత్రమే దృష్టి పెట్టిందని ఇప్పుడు మీడియాలో హైలైట్ అవుతోంది.
Tags