బంగారు షాపు లో చోరీ చేసిన దొంగలు అరెస్టు...
కేసు వివరాలను వెల్లడించిన తెనాలి డిఎస్పి పి జనార్ధన్...
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన బంగారం షాపు దొంగతనం కేసులో ముద్దాయిలను పొన్నూరు పట్టణ పోలీసు వారు చాకచక్యంగా పట్టుకొని కేసును చేదించారు. మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ముద్దాయిలు ముఠాగా ఏర్పడి దొంగతనం చేసినట్లు శనివారం తెనాలి డిఎస్పి బి. జనార్దన్ రావు, పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి మీడియా ముందు హాజరు పరిచారు. నిందితులు ఉపయోగించిన కారును, దొంగతనం చేసిన 21 లక్షల విలువ గల 24 కిలోల వెండి వస్తువులను, 6 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు. సమావేశంలో పొన్నూరు అర్బన్ సిఐ రవి కిరణ్, క్రైమ్ పార్టీ, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.