సాగర్ కుడి కాలువలో గల్లంతైన యువకుడు మృతదేహం లభ్యం.
వినుకొండ:- బొల్లాపల్లి మండలం సంగం బ్రిడ్జి తండా వద్ద సాగర్ కుడి కాల్వలో రామవాత్ రవినాయక్ అనే యువకుడు గల్లంతయ్యాడు... శుక్రవారం రాత్రి వినుకొండ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విధులు ముగించుకుని స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరాడు... సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అతనిని కాలువలోకి తోసేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ బండ్లమోటు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ సంఘటన పై పోలీసులు విచారణ చేపట్టారు.
రవి నాయక్ మృతదేహాన్ని ఆదివారం ఉదయం ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం సిద్ధన పాలెం వద్ద కాలువ లాకుల వద్ద గుర్తించి బయటకు తీశారు.