ఆయుష్మాన్ భారత్ రాష్ట్రాలకు కేంద్రం లేఖ
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని 70 ఏళ్లు, ఆ పైబడిన వారందరికీ వర్తింపజేయనున్నట్లు కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇందులో భాగంగా అర్హులైన వారి పేర్లను నమోదు చేయాలని అన్ని
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి ఎల్ఎస్ చాంగ్సన్ లేఖ రాశారు. ఆయుష్మాన్ మొబైల్ యాప్, వెబ్సైట్లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామన్నారు.