రాజ్యసభ రేసులో నాగబాబు
ఏపీలో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. కూటమికే ఈ స్థానాలు దక్కే అవకాశం ఉండటంతో ఒకటి జనసేనకు, రెండు టీడీపీకి వెళ్తాయనే ప్రచారం జరుగుతోంది. జనసేన
తరుపున పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును ఎంపిక చేసే చాన్స్ ఉందని సమాచారం. టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు,యనమల రామకృష్ణుడి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.