బాధిత కుటుంబానికి కొండంత అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ" ---తన్నీరు నాగేశ్వరరావు
ఇటీవల కాలంలో జగ్గయ్యపేట పట్టణం మిట్టగూడెం నాగవయ్య బజారు నందు టీడీపీ నాయకుల వేధింపులు, దౌర్జన్యాలకు గురైన గుగ్గిళ్ల శ్రీను, ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకు అండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు, ఈ బ్యాంకు చెక్కును ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ (చిన్న) చేతుల మీదుగా బ్యాంకు చెక్కును బాధిత కుటుంబానికి అందజేసారు. ఈ సందర్భంగా తన్నీరు మాట్లాడుతూ కార్యకర్తకి అండగా ఉండటంలో జగన్మోహన్ రెడ్డికి సాటిలేదని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి వెన్నుదండుగా ఉంటుందని, దాడులకి ప్రతి దాడులకి ఎందాకైనా పోరాటం చేస్తామని, శీను చనిపోయిన వారం వ్యవధిలోనే కుటుంబానికి తక్షణం ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని, కొత్తగా ఏర్పాటు చేసిన స్తంభాన్ని అధికారులతో మాట్లాడి వారం రోజులు వ్యవధిలో తొలగించడం జరిగిందని, ఇది వైఎస్ఆర్ పోరాట విజయమని, అలాగే నియోజవర్గంలోని గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సామాన్య కుటుంబంలో రెక్కాడితే డొక్కాడని మా పార్టీ కార్యకర్త అయిన శీను స్థానిక టిడిపి నాయకులు వేధింపుల వల్ల ఆత్మహత్య గురై చనిపోవడం జరిగిందని, చనిపోయిన విషయాన్ని నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ నాయకులు నా దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కి తెలియజేసి తక్షణ ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, తెలియజేస్తారు.అనంతరం గుగ్గిళ్ల శీను కుటుంబ సభ్యులు మాట్లాడుతూ స్తంభాన్ని ఏర్పాటు చేయడంతో శ్రీను మన స్థాపంతో మృతిచెందారన్నారు. మృతుడి తల్లిని కూడా దుర్భాషలాడి దౌర్జన్యం చేశారన్నారు. టీడీపీ నాయకుల అరాచకానికి ఈ ఘటనే నిదర్శమని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటి సహాయం అందించడం పట్ల ఎప్పటికీ రుణపడి ఉంటామని, వారికి కృతజ్ఞతలు అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ హఫీజున్సీసా - ఫిరోజ్ ఖాన్, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ వట్టేం మనోహర్, పెనుగంచిప్రోలు ఎంపీపీ మార్కపుడి గాంధీ, వత్సవాయి ఎంపీపీ రమాదేవి, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థాన డైరెక్టర్ నంబూరి రవి, సర్పంచ్ పాపినేని వెంకటేశ్వరరావు, నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షుడు మల్లేశ్వరరావు, మాజీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామీలు, వర్క్ బోర్డ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జుబేరు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బద్దూ నాయక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముదిరాజ్ చాపల వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ నరసింహారెడ్డి, పెద్దమోదుపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు నాగరాజు, అన్నా బత్తుల శీనువాస్, మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు చింతకుంట్ల వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ అనుబంధా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.