నుగంచిప్రోలు స్థానిక శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో దసరా పండుగను పురస్కరించుకొని ముందుగా కన్నుల పండుగగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయిని లు వివిధ రకాల పూలతో బతుకమ్మను అలంకరించారు,ఆటపాటలతో కేరింతల మధ్య విద్యార్థులు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు,ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పూర్ణచంద్రరావు, ఆర్ ఐ వినోద్, ఏజిఎం మురళీకృష్ణ, డీన్ కౌన్సిల్యాదేవి, ఇన్చార్జిలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.