పాత విధానంలో ఇసుక అందజేయాలి- బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ
October 01, 2024
0
జగ్గయ్యపేట అక్టోబర్ 1 (వార్తా ప్రభ) ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఇసుక ఆన్లైన్ విధానం లో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే విధంగా ఉందని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. వాహనాలకు జిపిఎస్ సిస్టం, ఆన్లైన్ బుకింగ్ స్థానికులకు అవడం లేదని. ఇతర ప్రాంతాల వారు ఈ ప్రాంతంలోని ఇసుకను తరలించుకుపోతున్నారని.ఇసుకను పాత విధానంలో ట్రాక్టర్లకు లోడ్ చేయాలని ఇసుక యార్డ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. నాయకులు అధికారులు ఇసుకను ఆన్లైన్ విధానం తొలగించి. పాత పద్ధతిలో ఇసుకను అందజేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని శాసనసభ్యుల కార్యాలయంలోనూ, మండల రెవెన్యూ కార్యాలయంలోనూ వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నేలకంఠ శివప్రసాద్. అధ్యక్ష కార్యదర్శులు అంబోజి శివాజీ, పోతుపాక వెంకటేశ్వర్లు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.
Tags