మహాత్మా గాంధీజీ గారి జయంతి సందర్భంగా నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ పార్క్ నందు మన జాతి పిత మహాత్మ గాంధీ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఫిరోజ్ ఖాన్ మున్సిపల్ కౌన్సిలర్ వట్టేం మనోహర్, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థాన డైరెక్టర్ నంబూరి రవి .
_ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని
ఉజ్వల భవిష్యత్తు కోసం పాటుపడేందుకు మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకుందాం, అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలతో స్వాతంత్ర సంగ్రామంను ముందుకు నడిపించిన జాతిపిత మహాత్మా గాంధీ అని సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు, గాంధీ గారి కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థని స్థాపించారు అని తెలిపారు._
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్స్ బోర్డ్ డైరెక్టర్ జుబేర్, రాష్ట్ర ఎస్టీ సేల్ ఉపాధ్యక్షులు బద్దు నాయక్, మాజీ టౌన్ పార్టీ అధ్యక్షుడు చోడవరపు జగదీష్, ఆనంద్ పాల్, సత్య శ్రీనివాస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.