ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం – సామినేని విమల భాను ఫౌండేషన్ ఛైర్మన్, సామినేని విమల భాను గారి ఆధ్వర్యంలో జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారి సమక్షంలో జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన మహిళా నాయకులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి జగ్గయ్యపేట నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని కోరారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని వీడిన వారు జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన మాజీ పెనుగంచిప్రోలు మండల సమైఖ్య అధ్యక్షురాలు కాకాని పద్మ గారు, జగ్గయ్యపేట మాజీ కౌన్సిలర్ కవర్తపు భూలక్ష్మి గారు, పట్టణ మహిళా నాయకురాళ్లు బెంబవరపు కృష్ణ కుమారి గారు, అడపా రమణీ గారు, మెడపురెడ్డి కృష్ణా నాయుడు గారు మరియు యనముల సింధుజ రెడ్డి గారు జనసేన పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట 28 వ వార్డు కౌన్సిలర్ షేక్ సిరాజున్ గారు, జనసేన మైనారిటీ నాయకులు షేక్ సత్తార్ గారు, షౌకత్ అలీ గారు, ఈమని కిశోర్ గారు, కాంట్రాక్టర్ సూరిబాబు గారు పాల్గొన్నారు.