ఎన్టీఆర్ జిల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గం – జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారి సమక్షంలో జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి జగ్గయ్యపేట నియోజకవర్గంలో క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని కోరారు.
_వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని వీడిన వారు జగ్గయ్యపేట పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు ప్రముఖ అడ్వకేట్ ఈశ్వరప్రగడ జగన్నాధరావుగారు, గోగిశెట్టి మహేశ్వరరావు గారు, చిట్టిపోతుల సత్యనారాయణ గారు, నల్లమోతు సుబ్బారావు గారు, కఠారి హరిబాబు గారు, తుళ్ళూరు తిరుమలరావు గారు, కొట్టే బసవపూర్ణయ్య గారు, కామిశెట్టి అమర్నాథ్ గారు, సుంకర వెంకటేశ్వరరావు గారు, పసుపులేటి హరిబాబు గారు , పిన్నెల్లి పాండురంగారావు గారు, సనక మురళి గారు , అడ్వకేట్ గుంటక లక్ష్మీనారాయణ గారు మరియు మైనారిటీ నాయకులు మహమ్మద్ రఫీ గారు, చిల్లకల్లు గ్రామానికి చెందిన సీనియర్ ఎస్సి నాయకులు కటికొల ఇజ్రాయిల్ బాబు గారు, కాంట్రాక్టర్ రావెల వేంకటేశ్వరరావు గారు జనసేన పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమం లో జగ్గయ్యపేట జనసేన నాయకులు చిలుకూరి శ్రీనివాసరావు గారు , మాదాల వీరయ్య చౌదరి గారు, షౌకత్ అలీ గారు, ఈమని కిశోర్ గారు తదితరులు పాల్గొన్నారు.