మన సంస్కృతీ సంప్రదాయాలు , మన జీవన విధానాన్నీ ప్రతిబింబించే పండుగ , ప్రకృతిలో దొరికే పూలతో ఆనందముగా జరుపుకునే పండుగ, ప్రకృతిని ఆరాదించే పండుగ బతుకమ్మ పండుగ అని విజ్ఞాన్ విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీమతి తన్నీరు సుధారాణి పేర్కొన్నారు. విజయదశమి పండుగనును పురస్కరించుకొని జగ్గయ్యపేట పట్టణం లోని విజ్ఞాన్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ది.01/10/2024 మంగళవారం ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలలో
ఆమె మాట్లాడుతూ తమ స్కూల్ నందు చదువుతో పాటు అన్ని మతాల పండుగలకు ప్రత్యేక ప్రాధాన్యతను కల్పిస్తూ విద్యార్థులకు మత సామరస్యాన్ని అలవర్చుతామని తెలిపారు. బాలికల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బాలికలు అందరు బతుకమ్మలను చక్కగా అలంకరించుకొని తీసుకువచ్చినారు. అనంతరం విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు దసరా దేవి నవరాత్రుల పండుగా శుభాకాంక్షలను తెలియజేసినారు.