ఉమ్మడి గుంటూరు , కృష్ణా జిల్లాల పట్టభద్రుల (గ్రాడ్యుయేట్లు) ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పునూరు గౌతమ్ రెడ్డి పోటీ చేయనున్నారు.ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వారి స్వగృహం వద్ద మంగళవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు , వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అభ్యర్థి పూనూరు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ అభ్యర్థులందరూ త్వరితగతిన తమ ఓటును హక్కును దరఖాస్తు చేసుకోగలరని, ప్రతి ఒక్కరి ఓటు మనకి అమూల్యమైనది, ఈ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో మన సత్తా ఏంటో చూపించాలని, ఈ నియోజకవర్గం నుంచి కనీసం 5000 మంది ఓటర్లు నమోదు చేయాలి అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గ నుండి స్థాయి శక్తులు కష్టపడి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థాన డైరెక్టర్ నంబూరి రవి, వైస్ చైర్మన్ ఫిరోజ్ ఖాన్, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ వట్టేం మనోహర్, రాష్ట్ర ఎస్టీ సేల్ ఉపాధ్యక్షులు బద్దు నాయక్, ఎంపీటీసీ కాకాని స్రవంతి, సుబ్బయిగూడెం గ్రామ సర్పంచ్ పాపినేని వెంకటేశ్వరరావు, బలుసుపాడు సర్పంచ్ సూరిబాబు, నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షుడు మల్లేశ్వరరావు, మాజీ ఎంపీపీ పెంటి శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ అనుబంధా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.