ప్రభుత్వం తన బాదుడే బాదుడు పథకంలో భాగంగా ప్రజలపై చెత్త పన్ను వేసింది
October 02, 2024
0
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం తన బాదుడే బాదుడు పథకంలో భాగంగా ప్రజలపై చెత్త పన్ను వేసింది. పన్ను కట్టకపోతే వాళ్ళ గడప ముందు చెత్త తెచ్చి పోయించింది. ఈ దుర్మార్గాలను తెలుగుదేశం పార్టీ అప్పుడే ఖండించింది. చెత్త పన్నును తీవ్రంగా వ్యతిరేకించాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెత్త పన్నును రద్దు చేస్తా అని ప్రజలకు హామీ ఇచ్చాను. ఈరోజు పూజ్య గాంధీజీ జయంతి సందర్భంగా... "స్వచ్ఛత హీ సేవా" కార్యక్రమ వేదికగా చెత్త పన్నును రద్దు చేస్తున్నాను. ఈరోజు నుంచి రాష్ట్రంలో చెత్త పన్నును వసూలు చేయరు. వచ్చే క్యాబినెట్లోనే ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపి అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది