g
ఈ నెల 3వ తేదిన తిరుపతిలో వారాహి సభలో పాల్గొనున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు.
👉 ఎన్నడు లేనివిధంగా గ్రామ పంచాయితీలకు అత్యధికంగా నిధులు.
👉 ఒకే కాలంలో 9వేల గ్రామ సభలు నిర్వహించి గిన్నిస్ రికార్డు కు ఎక్కిన జనసేనని.
ఈ నెల 3వ తేదిన తిరుపతిలో జరగనున్న వారాహి సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసైనికులు అంతా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మాజీ ప్రభుత్వవిప్, జనసేన నాయకులు సామినేని ఉదయభాను గారు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం విజయవాడ లోని గురునానక్ కాలనీ నందు ఉదయభాను గారి నివాసంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత 11రోజులు గా చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష అనంతరం ఈ నెల 3వ తేదిన తిరుపతిలో వారాహి సభను నిర్వహించనున్నారని తెలిపారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకై గ్రామ పంచాయితి శాఖ మంత్రిగా పదవి తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు అత్యంత వేగంగా గ్రామ పంచాయితిల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు అని అన్నారు. దానిలో భాగంగా ప్రతి పంచాయతీకి లక్ష రూ సొంత నిధులు కేటాయించడం అభినందనీయం అన్నారు. అలాగే ఏకకాలంలో 9వేల గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించడం రాష్ట్రానికి ఎంతో గర్వ కారణం అన్నారు. రాష్ట్ర అభిృద్ధికై పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న శ్రద్ధను జనసైనికులు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి అని అన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించనున్నదని ఆయన తెలిపారు.