మహాత్ముని సేవలు ఆదర్శనీయం.

indian media
0


 దేశానికి స్వాతంత్ర్యం రావడానికి గాంధీజీ నిస్వార్ధంగా సేవలందించారని మాజీ ప్రభుత్వ విప్, జనసేన పార్టీ నాయకులు సామినేని ఉదయభాను గారు అన్నారు.


గాంధీ జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలో స్థానిక బస్ స్టాండ్ వద్ద ఉన్న మున్సిపల్ పార్క్ నందు గాంధీ గారి విగ్రహానికి మాజీ ప్రభుత్వవిప్ జనసేన పార్టీ నాయకులు సామినేని ఉదయభాను గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు


.

ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ గారు అహింస వాదంతో ముందుకు వెళ్లి మనకు స్వాతంత్రాన్ని సాధించారని అన్నారు. బ్రిటిష్ వారు ఎన్ని ఇబ్బందులు పెట్టిన అహింసా సిద్ధాంతం తోనే ముందుకు వెళ్లారని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">