జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆ పార్టీలో చేరిన ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయభాను గారిని నందిగామ మండలం లింగలపాడు గ్రామనికి చెందిన జన సైనికులు మంగళవారం ఉదయభాను గారిని వారి స్వగృహంలో కలిశారు. శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
చేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఉదయభాను గారు మాట్లాడుతూ జిల్లాలో పార్టీ మరింత బలోపేతానికి ప్రతి ఒక్క జన సైనికులకు కృషి చేయాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు జాబి శెట్టి మధు సుధన్ రావు, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ మండల అధ్యక్షులు కొంగర రామకృష్ణ, జనసేన కార్యకర్తలు జాబిశెట్టి సతీష్,ముత్యం లక్ష్మీ నరసింహారావు,బండి అయ్యప్ప, సూర మురళీ తదితరులు పాల్గొన్నారు.