సామాజిక సేవ,శాంతి , ధర్మ మార్గం అనుసరించాలి
గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రి ఆశయ సాధనకు కృషి చేద్దాం
పారిశుద్ధ్య కార్మికులకు కోహన్స్ సేవలు అభినందనీయం.
ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య.
పెద్దలు చూపిన సామాజిక సేవ శాంతి, ధర్మ మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు అన్నారు. బుధవారం గాంధీ గారి 155 వ జయంతి సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ మున్సిపల్ ఆఫీస్ నందు గల గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్యే తాతయ్య గారు, చైర్మన్ రాఘవేంద్ర రావు గారు, మాజీ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు గారు నాయకులు, స్థానికులతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎమ్మెల్యే తాతయ్య గారు మాట్లాడుతూ
దేశానికి స్వాతంత్రం రావడం లో శాంతి మార్గాన్ని అనుసరించిన గాంధీజీని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
ఆనాడు దేశానికి స్వతంత్ర సమర ఉద్యమాల్లో పాల్గొంటూ,అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పరిసరాల పరిశుభ్రత పై గాంధీజీ అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సంఘటనలు వివరించారు.
వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, శాంతి, ధర్మ, మార్గాలతో జీవిస్తూ సామాజిక సేవ కార్యక్రమాలలో తన చేతనైనా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్లాలని కోరారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు కోహాన్స్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన యూనిఫామ్ లను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు వారికి అందజేశారు.
అదేవిధంగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ సమీపంలో మొక్కలను నాటిన అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో, సచివాలయ సిబ్బందితో కలిసి బస్టాండ్ ప్రాంగణాన్ని శుభ్రపరిచారు.