ఈరోజు గోపాలపురం పంచాయతీలో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న జనసేన నాయకులు.
ఈరోజు గోపాలపురంలోని మట్టి తవ్వకాలు గత కొన్ని రోజులుగా స్వేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతుండడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవడంతో ఈ విషయమై జనసేన పార్టీ దృష్టికి తీసుకురాగా,
తిరువూరు నియోజవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త
శ్రీ మనుబోలు శ్రీనివాసరావు గారు మరియు ఏ కొండూరు మండల అధ్యక్షులు లాకావత్ విజయ గారు, తిరువూరు మండల అధ్యక్షుడు శ్రీ పరిస పుల్లారావు గారు మరియు
ఏ కొండూరు మండలంలోని మండల కమిటీ సభ్యులు మరియు జనసేన నాయకులు అందరూ కలిసి క్వారీ వద్ద ఉన్న టిప్పర్లను మరియు జెసిబిలను అడ్డుకోవడం జరిగింది. ఈ విషయమై స్థానిక అధికారులు దృష్టికి మరియు నియోజకవర్గ నాయకులు దృష్టికి తీసుకు వెళ్లడం జరిగినది .దీని వెనక ఎవరిహస్తం ఉంది ,ఎవరు ఈ క్వారీ నడుపుతున్నది అన్ని ప్రజల ముందుకు తీసుకురావాలని, అధికారులకు సమన్వయకర్త సూచించడం జరిగినది. తక్షణమే దీనికి సమాధానం చెప్పాలని చెప్పని యెడల ఉద్యమం తీవ్ర స్థాయిలో ముందుకి తీసుకెళ్తామని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగినది.
ఇట్లు,
తిరువూరు నియోజవర్గ జనసేన పార్టీ.