సుమారు 30 లక్షలు విలువైన గంజాయి, 2కార్లు స్వాధీనం.
||జగ్గయ్యపేట నియోజకవర్గ0|| వత్సవాయి
ఏపి రాష్ట్ర ప్రభుత్వం వారు రాష్ట్రంలో గంజాయిని సమూలంగా నిర్మూలించి రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈగల్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజ శేఖర బాబు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా అనేది లేకుండా చేయడానికి పటిష్టమైన నిఘా
పలు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం వాహన తనిఖీలు.
నగర పోలీస్ కమిషనర్ కి రాబడిన సమాచారం మేరకు వత్సవాయి ఎస్ఐ వారి సిబ్బంది కలిసి చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో వాహన తనిఖీలు
అదే సమయంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న రెండు కార్లు, నలుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారివద్ద నుండి సుమారు 218 కేజీల గంజాయిని, గంజాయి తరలించడానికి ఉపయోగించిన రెండు కార్లను స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు.
నిందితుల వివరాలు
1. అనకాపల్లి జిల్లా, రోలుగుంట మండలం, బెన్న భూపాలపట్నం గ్రామానికి చెందిన బియ్యాల నాగేశ్వరరావు (33సం)
2. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం, బెన్న భూపాలపట్నం గ్రామానికి చెందిన అనుమాల ప్రసాద్ (55సం)
3. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం మరుపాక గ్రామానికి చెందిన తలారి రమణ (29సం)
4. నర్సీపట్నం మండలం, పాత టైపు రెడ్డి పాలెం గ్రామానికి చెందిన బైపు రెడ్డి ఎల్లయ్య (31సం )
ఈ నలుగురు నిందితులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించి జల్సాలు చేయాలనే ఉద్దేశంతో హైదరాబాదులో గంజాయికి మంచి గిరాకీ ఉంది,
ఒరిస్సా రాష్ట్రంలో గంజాయి చాలా తక్కువ రేటుకు లభిస్తుంది వాటిని తీసుకొని హైదరాబాద్ తీసుకువెళ్లి అక్కడ ఎక్కువ రేటు అమ్మితే అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని నిర్ణయించుకొని ఏపి రాష్ట్ర సమీపంలోని ఒరిస్సా బోర్డర్ తండాలలో తక్కువ రేటుకు గంజాయి కొనుగోలు చేసి 2కార్లలో సర్దుబాటు
నర్సీపట్నం నుండి బయలుదేరి హైదరాబాద్ వెళుతున్న సమయంలో పట్టివేత
నగర పోలీస్ కమిషనర్ కి రాబడిన పక్కా సమాచారంతో జగ్గయ్యపేట సిఐ, వత్సవాయి ఎస్ఐ వారి సిబ్బందితో కలిసి చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేసి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు
సుమారు 30 లక్షలు విలువైన 218 ( 109 ప్యాకెట్లు ఒక్కొకటి 2 కిలోలు ) కిలోల గంజాయి, గంజాయి తరలిస్తున్న రెండు కార్లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగింది.
జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు
ఏసిపి తిలక్ ప్రెస్ మీట్ లో వివరించారు.